నేటి నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలు
20 నుంచి 25లోగా జిల్లా అధ్యక్ష, కార్యవర్గాలు
అనుబంధ కమిటీలకూ ఎన్నికలు శ్రేణుల్లో నూతనోత్సాహం
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : నేడు టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు శ్రేణులు సిద్ధమవుతు న్నాయి. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేయగా, అందుకనుగుణంగా ముందుకు సాగు తున్నాయి. ఊరూరా గులాబీ పతాకాలను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయగా, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 25వ తేదీలోగా వార్డు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనుండగా, శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.
టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు మందుకుసాగుతున్నారు. జెండా పండుగ అనంతరం వార్డు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోగా పూర్తికానుండగా, జెండా పండుగను అట్టహాసంగా నిర్వహించాలని విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పూర్తయిన ఏర్పాట్లు..
జెండా పండుగ నిర్వహణ, కమిటీల ఏర్పాటుపై విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. అన్ని చోట్ల ప్రజల భాగస్వామ్యంతో గురువారం పార్టీ జెండాలు ఎగురవేయాలని నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు పండుగను విజయవంతం చేయడంతోపాటు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను పూర్తిచేసేలా నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ గురువారం ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు. పార్టీ జెండా పండుగను కూడా ఇదే రోజు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు కావస్తున్నది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటుతో సరికొత్త నిర్మాణాన్ని టీఆర్ఎస్ చేపట్టబోతున్నది. పలువురికి కొత్తగా పార్టీ పదవులు దక్కనున్నాయి.