నార్నూర్, జనవరి 6 : పూష్య పౌర్ణమిని పురస్కరించుకొని నార్నూర్ మండల కేంద్రంలోని ఖాందేవ్ ఆలయంలో తొడసం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి భీంరావ్ పవిత్ర గం గాజలంతో దేవుళ్లకు అభిషేకం, సాంప్రదాయ మహాపూజలు చేశారు. శనివారం ఉదయం ఆ వంశం ఆడబిడ్డ నువ్వుల నూనె తాగనున్నది. ఆ నవాయితీగా వస్తున్న ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, మ హారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి తొడసం వం శీయులు కుటుంబ సమేతంగా తరిలివచ్చి మొ క్కలు చెల్లించుకుంటారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మైసమాల్కు సంప్రదాయ పూజలు..
మాన్కాపూర్లోని గోవర్ధన్గుట్ట వద్దకు గురువారం రాత్రి తొడసం వంశీయులు కుటుంబ సమేతంగా చేరుకొని బస చేశారు. మైసమాల్ దేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. సహపంక్తి భోజలు చేశారు. శుక్రవారం నార్నూర్లోని ఖాందేవ్ ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. మర్రిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, మొక్కులు చెల్లికున్నారు.
నేడు ప్రముఖుల రాక..
జాతర మహాపూజతో పాటు ఆ వంశం ఆడబిడ్డ తైలం తాగే మహోత్సవాన్ని తిలకించేందుకు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, ఎంపీ సోయం బాపురావ్, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్నాయక్, ఎంపీపీ కనక మోతుబాయితో పాటు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొనున్నట్లు ఆలయ నిర్వాహకుడు తొడసం నాగోరావ్, తొడసం రాజుపటేల్, పండు పటేల్, కటోడ బాపురావ్, ఆనంద్రావ్ తెలిపారు.