ఉట్నూర్, అక్టోబర్ 18: సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చానని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. మండలంలోని హర్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాన్సన్ నాయక్ మాట్లాడుతూ సమయం తక్కువగా ఉందని, కార్యకర్తలంతా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఖానాపూర్ నిజయోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రి కేటీఆర్ జాన్సన్ నాయక్‌ను పంపించారని పేర్కొన్నారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, సెడ్మకి సీతారాం, కోఆప్షన్ సభ్యుడు రశీద్, మర్సకోల తిరుపతి, సుమన్‌బాయి, సలీం, దాసండ్ల ప్రభాకర్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ఆదివాసీ మహిళా నాయకురాలు పుష్ప బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి, అభ్యర్థి గెలుపునకు కృషిచేస్తానని తెలిపారు. అలాగే మరికొందరు యువకులు పార్టీలో చేరారు.