ఇచ్చోడ, జూలై 13 : బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురసరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా 24 మంది మహిళలకు ఆదివారం ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. ఈనెల 24న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురసరించుకుని 18 నెలల కాంగ్రెస్ పాలనలో డెలివరీ అయిన 24 మంది మహిళలకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణి చేశామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాలింతల కోసం డెలివరీ అయిన ప్రతి మహిళకు కిట్లను పంపిణీ చేసేదనన్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్లను ఇవ్వడం బంద్ చేసి మహిళలకు రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. ముక్రా(కే) గ్రామంలో కాంగ్రెస్ పాలనలో 18 నెలలో 24 మంది మహిళలు డెలివరీ అయ్యారని, బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని 24 మంది మహిళలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశామన్నారు. ఇక నుంచి గ్రామంలో డెలివరీ అయినా ప్రతి మహిళకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ పాల్గొన్నారు.