ఎదులాపురం, ఫిబ్రవరి 3 : అంధత్వ నివారణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జైలులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా సూపరింటెండెంట్ అశోక్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో 128 మంది ఖైదీలకు పరీక్షలు చేసి 49 మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఖైదీలతో పాటు అక్కడి అధికారులు, సిబ్బందికి కంటి పరీక్షలు చేసి అవసరమున్న వారికి అద్దాలు అందజేశామన్నారు. ప్రత్యేక శిబిరాల కోసం రెండు బపర్ టీంలు ఏర్పాటు చేశామాన్నారు. కార్యక్రమంలో పీడీవో అనిల్ కుమార్, డాక్టర్లు శిల్ప, ఈశ్వర్, జైలర్ సూర్యప్రకాశ్ రెడ్డి, డిప్యూటీ జైలర్ ఆర్ ప్రకాశ్, రాథోడ్ కృష్ణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కంటివెలుగు
నార్నూర్, ఫిబ్రవరి 3 : ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రణాళికాయుతంగా అమలు చేస్తున్నారని ఎంపీటీసీ లక్ష్మి అన్నారు. గాదిగూడ మండలం పిప్రి గ్రామ పంచాయతీలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కలాబాయి దిగంగర్, ఎంపీటీసీ పరిశీలించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారి అరవింద్, లింగేశ్, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, ఎంపీహెచ్ఏ రాథోడ్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 3 : పేద ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఈవో సంజీవరావ్, డాక్టర్ రాథోడ్ సంధ్యారాణి అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు కంటి వైద్య పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, హెల్త్ సూపర్వైజర్ జాదవ్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ బలిరాం, వైద్య సిబ్బంది విలాస్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
నార్నూర్, ఫిబ్రవరి 3 : గాదిగూడ మండలం రూప్పాపూర్లో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఐకేపీ ఏపీఎం మాధవి పరిశీలించారు. కంటి వెలుగుకు సంబంధించిన వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు సంజీవ్, స్నేహ, హెచ్‌ఈవో పవార్ రవీందర్, రేణుక, సిబ్బంది పాల్గొన్నారు.