పెంచికల్పేట్, ఏప్రిల్ 21 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒకరూ నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక రూ అధికారులకు సహకరించాలని కోరారు. రూరల్ సీఐ రాం బాబు, ఎస్ఐ ఉన్నారు.
దహెగాం, ఏప్రిల్ 21 : శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ నిర్వహిస్తున్నట్లు కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం ఉదయం దహెగాం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగజ్‌నగర్ రూరల్ సీఐ అల్లం రాంబాబు, ఎస్ఐ కందూరి రాజు పాల్గొన్నారు.