కుభీర్ : ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు ( Munnur Kapus ) సంఘటితం కావడం ఒక సామాజిక అవసరమని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టే హన్మండ్లు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పార్డి (కే) గ్రామంలో నిర్వహించిన కాపు సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణంలో భాగంగా కుల సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సామాజిక సమస్యలు ( Social Issues ) తలెత్తినప్పుడు ఆత్మీయ సమ్మేళనాలను క్రమం తప్పకుండా నిర్వహించుకోవడం వల్ల అనుబంధాలను పెంచుకోవచ్చని సూచించారు. సామాజికంగా, ఆర్థికంగా, బలహీనంగా ఉన్న కుల సోదరులను ఉపాధి అవకాశాలు కల్పించడం సహాయం చేయడం వల్ల సంఘటిత శక్తిని పెంచుకోవచ్చన్నారు. కుల పరంగా అన్యాయాలు, పక్షపాతాలను ప్రశ్నించాలని సూచించారు.
యువతను రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో క్రియాశీలకంగా తయారుచేసి నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయాలని సూచించారు. అక్టోబర్ 5 న భైంసా పట్టణంలో జరిగే నియోజకవర్గస్థాయి సర్వసభ్య సమావేశానికి భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో మల్లేష్, శంకర్, భూమన్నను సంఘ అధ్యక్షుడు సాతంశం శంకర్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ బందెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.