కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబరు 15 (నమస్తే తెలంగాణ) : సిర్పూర్ పేపర్ మిల్లులో యాజమాన్యానికి-లారీ అసోసియేషన్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఈ నెల 5న ప్రారంభమైన లారీల యజమానుల సమ్మె ఇంకా కొనసాగుతున్నది. ఎస్పీఎం యజమాన్యం- లారీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు విఫలం కావడం, కలెక్టర్, ఎస్పీ సమక్షంలో జరిపిన చర్చలు కూడా ఫలించకపోవడంతో లారీ యజమానులు సమ్మె కొనసాగిస్తున్నారు. దాదాపు 10 రోజులుగా ఆందోళన చేపడుతున్నప్పటికీ ఎస్పీఎం యాజమాన్యం స్పందించడం లేదని, తమ న్యాయమైన సమస్యకు పరిష్కారం చూపే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
కార్మికులపై ప్రభావం
దాదాపు 160 లారీలు ఎస్పీఎంలో ఉన్నాయి. లారీల యజమానులతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్, అన్లోడింగ్ సిబ్బంది, మెకానిక్‌లు.. ఇలా అంతా కలిసి దాదాపు వెయ్యి మంది వరకు లారీలపై ఆధారపడి జీవిస్తున్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులు దాదాపు 2500 వరకు ఉంటారు. లారీల సమ్మెకారణంగా లోడింగ్ అన్లోడింగ్ జరుగకపోవడంతో కార్మికులందరిపై ప్రభావం పడుతోంది. కంపెనీకి తీవ్రనష్టం జరుగుతోంది. సమ్మె కారణంగా అటు యాజయాన్యంతో పాటు కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించే వరకు సమ్మె కొనసాగుతుందని లారీ అసోసియేషన్ చెబుతున్నది.
యాజమాన్యం మొండి వైఖరి వీడాలి : కోనప్ప
ఎస్పీఎం మొండి వైఖరి వీడాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం లారీల యజమానులు తమ కుటుంబాలతో సహా సమ్మెలో పాల్గొనగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మూత పడిన ఫ్యాక్టరీని గత సర్కారు ఎంతో కష్టపడి ప్రారంభించిందని, స్థానికంగా ఉండే వందలాది మందికి ఉపాధి కల్పించిందన్నారు. ఇప్పుడు యాజమాన్యం వైఖరి వల్ల మళ్లీ ఎస్పీఎంను సమస్యలు చుట్టుముడుతున్నాయని తెలిపారు. సమస్య మరింత జఠిలం కాకముందే యాజమాన్యం స్పందించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంపెనీ వ్యవహరిస్తోందని, వేలాది మందికి ఉపాధిని కల్పించే కంపెనీ మొట్టుదిగి రావాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా-కంపెనీ మీద చర్యలు తీసుకోకుండా అధికారులు వెనుకడుగు వేస్తున్నారని కోనేరు కోనప్ప ఆరోపించారు.
డిమాండ్లు ఇవే..