SP Akhil Mahajan | ఉట్నూర్ : ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక కార్యచరణను రూపొందించారు. ఈ సందర్భంగా వాటిని అవలంబించే దిశగా సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న మూడు సర్కిల్ ఆఫీసులు, 8 పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలోని సుమారు 200 కేసులను పరిష్కరించే దిశగా పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
పెండింగ్ లో ఉన్న కేసులలో ఎంవీఐ, పీఎంవీ రిపోర్టులు, అగ్రికల్చర్, వెటర్నరీ కార్యాలయాల రిపోర్టులను సాధ్యమైనంత త్వరగా తీసుకొని దర్యాప్తు పూర్తిచేసి పెండింగ్ కేసులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితుల కేసులను దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులకు శిక్షలు పడినప్పుడే బాధితులకు సరైన న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వారిగా పెండింగ్లో ఉన్న ఒక్కో కేసు వివరాలను క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకుని, సులువుగా పూర్తి చెసే కేసులను మరియు మొత్తంగా రోజుకు దాదాపు 200 కేసులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రతీ పోలీస్ స్టేషన్ అధికారికి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్, సీఐలు జీ మొగిలి, రహీం పాషా, సబ్ డివిజన్లోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, రైటర్లు పాల్గొన్నారు.