కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిఘ్వ గ్రామపంచాయతీ కార్యదర్శి సింధుజా ( Secretary Sinduja ) పై అధికారులు విచారణ ప్రారంభించారు. గ్రామంలోని ఇద్దరు ఇందిరమ్మ లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకున్న వ్యవహారంలో కార్యదర్శి ఆరు నెలల క్రితం సస్పెండ్ అయ్యారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం కుభీర్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో నాగవర్ధన్, ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీవో భీమేష్, జిల్లా పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షాహిద్ అంతర్గత విచారణ ( Internal Inquiry ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులు నందాబాయి, సోమాబాయి, సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శి సింధుజాతో అంతర్గత విచారణ జరిపారు.
ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో సస్పెండ్ అయిన సింధుజాపై అంతర్గత విచారణ జరిపి వేర్వూరుఏగా వాంగ్మూలాల ను నమోదు చేశారన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు ఎంపీడీవో వివరించారు.