మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 1: జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగిన ప్రాక్టికల్స్‌లో 1048 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 906 మంది హాజరయ్యారు.
142 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు 848 మంది విద్యార్థులకు గాను 806 మంది హాజరవగా, 42 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను డీఐఈవో శైలజ పరిశీలించారు.