నిర్మల్ అర్బన్ సెప్టెంబర్ 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని డీటీడీవో శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శనివారం నిర్వహించారు. అక్టోబర్ 14 నుంచి 16 వరకు అండర్ 14, 17 జోనల్ స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. 274 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రతిభ చూపిన వారిని ఉట్నూర్‌లో జరిగే జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశామని డీటీడీవో పేర్కొన్నారు. శివాజీ, భూక్యా రమేశ్, రాంజీ, భోజన్న, రమణారావు, శ్రీనివాస్, అంబాజీ, భూమన్న, బుచ్చిరామారావు పాల్గొన్నారు.