సిరికొండ, సెప్టెంబర్ 1 : ప్రతి గ్రామంలో శుభ్రంగా స్వచ్ఛమైన వాతావరణం ఉండేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతీ ఇంటికి మరుగు దొడ్డి, ఇంకుడు గుంత ఉండాలనే నిబంధనతో అధికారులు ముందుకు 100 శాతం మరుగు దొడ్లు పూర్తి చేసిన గ్రామాలను ప్రకంటించారు.
అయితే క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉందా..లేదా..ఉపయోగిస్తున్నారా.. అని ప్రభు త్వం థర్థ్ పార్టీ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఆదిలా బాద్ జిల్లా 17 మండలాల పరిధిలో మరుగు దొడ్లు 32,873 నిర్మించారు. వీటిని రాండమ్‌గా సర్వే చేయడానికి 117 జీపీ పరిధి లోని 468 గ్రామాలను ఎంపిక చేధీరు. 17,225 మరుగు దొడ్లను పరిశీలించనున్నారు.
తనిఖీలకు ప్రత్యేక బృందాలు..
గ్రామాల్లో మరుగుదొడ్ల వివరాలు సేకరించేం దుకు 17 ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ఒక మండలంలో ఎంపీవోను మరో మండలానికి కేటాయించారు. ఎంపీవో, ఏఈ, ఇతర సిబ్బంది ఒక్కొటీంగా ఉన్నారు.17 మంది జిల్లా స్థాయి అధికారులు సర్వేను మానిట రింగ్ చేయనున్నారు. ఇలా సర్వేను సెప్టెంబర్ 4 వరకు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించను న్నారు. గ్రామాలను 100 శాతం మరుగుదొడ్ల గ్రామాలుగా ప్రకటించినా ఇప్పటికీ చాలాచోట్ల బహిరంగ మలవిసర్జన జరుగుతూనే ఉంది.
సర్వే ప్రారంభించాం
17 మండలాల్లో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్యంపై ఓడీఎఫ్ సర్వే ప్రారంభించాం. ఒక్కొ టీం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తు న్నారు. వ్యక్తిగత మరుగుదొడ్డి విని యోగంపై అవగా హన కల్పిస్తున్నారు. మండలానికి ఒక్క జిల్లా స్థాయి ఆధికారి సర్వేను మానిటరింగ్ చేస్తున్నారు. ఈ సర్వే జిల్లా ఈ నెల 4 వరకు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.
– ఎస్ కిషన్, డీఆర్డీవో ఆదిలాబాద్