బోథ్, మార్చి 2 : గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు గుదిబండగా మారిందని ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసనగా గురువారం రఘునాథ్‌పూర్ గ్రామంలో మహిళలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాకముందు రూ. 410 ఉన్న సిలిండర్ ధర నేడు రూ.1161 చేరుకుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన కానుక ఈ సిలిండర్ ధరల పెంపు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, మహిళలు పాల్గొన్నారు.
భీంపూర్, మార్చి 2 : వంట గ్యాస్ ధరల పెంపకంపై భీంపూర్‌లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, సర్పంచ్‌లు మడావి లింబాజీ, సయ్యద్ బాదర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, నాయకులు లస్మన్న యాదవ్, ముకుంద్, జాదవ్ రవీందర్, రాథోడ్ ఉత్తమ్, నరేందర్‌యాదవ్, కల్చాప్యాదవ్, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, మార్చి 2 : గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం ఆధ్వర్యంలో బజార్హత్నూర్లో ఇచ్చోడ-సోనాల రోడ్డుపై నాయకులు, వినియోగదారులు భారీ నిరసన చేపట్టారు. కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, ప్రకాశ్, చంద్రశేఖర్, సాయన్న, వినోద్, నాగోరావ్, తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆరోపించారు. గుడిహత్నూర్‌లో వంట గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, నాయకులు మాధవ్, ఆశన్న యాదవ్, దిలీప్, సురేశ్, సంతోష్‌గౌడ్, పాటిల్ రాందాస్, సోయం సతీశ్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 2 : నిత్యావసరమైన వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు సిలిండర్ ధరలు పెంచిందన్నారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నాయకత్వంలో శుక్రవారం మండల కేంద్రంలో చేపడుతున్న ఆందోళనలో గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఆయా విభాగాల బాధ్యులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గణేశ్, నాయకులు ప్రకాశ్, రవి, విఠల్, భాస్కర్ పాల్గొన్నారు.
సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న
తలమడుగు, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం అడ్డు, అదుపు లేకుండా పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ పిలుపునిచ్చారు. మండలంలోని సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్యుల జీవితాలతో కేంద్రప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదన్నారు. కేంద్రం ఇష్టానుసారంగా పెంచుతున్న సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆదేశానుసారం నేడు సుంకిడి అంతర్ రాష్ట్ర రహదారిపై నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఆయా విభాగాల బాధ్యులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మహేందర్ యాదవ్, ఎంపీటీసీ ఏలుగు చంటి, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస రెడ్డి, మగ్గిడి ప్రకాశ్, అబ్దుల్లా, కంది నర్సింహులు, జావిద్, సంతోష్ పాల్గొన్నారు.
భీంపూర్, మార్చి 2 : కేంద్రప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై అనునిత్యం అనేక రూపాలలో భారం మోపుతున్నదని బీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్ అన్నారు. తాంసిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక వైపు సీఎం కేసీఆర్ పేదల పక్షపతిగా ఎన్నో పథకాలు అమలు చేసి చూపుతుంటే ప్రధాని మోదీ ఇలా కుటుంబాలను యాతన పెడతున్నారని గుర్తు చేశారు. గ్యాస్ ధరలు తగ్గించకుంటే అవసరమైతే నిరాహార దీక్షలు చేపడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ, సర్పంచ్‌లు సదానందం, వెంకన్న, ఎంపీటీసీలు అశోక్, గంగన్న, నాయకులు రఘు, మహేందర్, వన్నెలనరేశ్, దాసు, కృష్ణ, కాంతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, మార్చి 2 : సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకొక్కక్క సిలిండర్‌పై రూ.50 పెంచడమంటే సామాన్యుడి నడ్డి విరవడమేనని, పెంచిన ధరలు తగ్గించకపోతే నియోజకవర్గంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, కోఆప్షన్ సభ్యుడు తాహెర్ బిస్ సలాం, వైస్‌ఎంపీపీ లింబాజీ, ఏఎంసీ వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అమృత్‌రావ్, సొసైటీ డైరెక్టర్ సొనాల లోలపు పోశెట్టి, రాజు, సర్పంచ్ సకారాం, బీసీ సెల్ మండలాధ్యక్షుడు బుచ్చన్న, పట్టణాధ్యక్షుడు అడెపు శ్రీనివాస్, సొనాల గ్రామాధ్యక్షుడు మునేశ్వర్ సోమన్న, మైనార్టీ అధ్యక్షుడు రఫీ, రమేశ్, దేవీదాస్ పాల్గొన్నారు.
నేరడిగొండ, మార్చి 2 : మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకే కొమ్ముకాస్తున్నదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 410 ఉన్న సిలిండర్ ధర రూ.1161కి పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు. గ్యాస్‌పైన వచ్చే సబ్సిడీ జమ రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. వంటగ్యాస్ పెంపును ఉపసంహరించి, సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీపీ రాథోడ్ సజన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ విశాల్‌కుమార్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, కరణ్‌సింగ్, లింబాజీ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.