బజార్ హత్నూర్: క్రీడా పోటీల్లో (Sports) పాల్గొనడం వల్ల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్ (MP Nagesh) అన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో మినీ స్టేడియంలో నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 48వ అంతరాష్ట్ర క్రీడ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సింథటిక్ మ్యాట్, మెర్క్యూరీ విద్యుద్దీపాల మధ్య క్రీడలను ఐదు దశాబ్దాలుగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.
ఎన్ని ఆటంకాలు వచ్చిన యూత్ సభ్యులు కలిసికట్టుగా పనిచేయడం పట్ల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పో రెడ్డి శ్రీనివాస్ , సహకార సంఘం చైర్మన్ మేకల వెంకన్న, జడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు తాటిపల్లి రాజు, నాయకులు కొత్త శంకర్, నానం రమణ, అలికే గణేష్, ఎట్టమ్ రాములు, చట్ల సుకుదేవ్ , మాజీ ఎంపీటీసీ ఈశ్వర్, యూత్ అధ్యక్షులు ఆత్రం హరీష్, మడవి కళ్యాణ్, శ్రీకాంత్ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.