ఇచ్చోడ : మండలంలోని గుబ్బ గ్రామస్తులు మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil ) సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామస్థులకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థులు మాట్లాడుతూ అభివృద్ధి చేసే సత్తా ఉన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చూసి పార్టీలోకి వచ్చామని తెలిపారు. కేసీఆర్ ( KCR) చేపట్టిన సంక్షేమాలే తెలంగాణకు శ్రీరామ రక్షగా భావించి పార్టీలో చేరామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయాలంటే కేసీఆర్‌కే సాధ్యమని అన్నారు. గిరిజన గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు.
గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించాలని గ్రామానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివారెడ్డి, విజయ్ రెడ్డి, గణేష్ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.