ఖానాపూర్, మే 24 : సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖానాపూర్ ని యోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో క్యాంపెయిన్ 360 అప్లికేషన్ పోస్టర్ను ఆవిషరించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్యాంపెయిన్ 360 అప్లికేషన్ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.
ఈ యాప్ ద్వారా ప్రతి ఒకరూ తమ సొంత ఫోటోలతో పలు శు భాకాంక్షలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన డిజైన్లు, వినూత్న పోస్టర్లు మరియు వీడియోలను సులువుగా రూపొందించుకోవచ్చని తెలిపారు. పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి ప్రభావవంతం గా తీసుకెళ్లేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుందని పేరొన్నారు.