వేమనపల్లి/బెజ్జూర్/భీమారం, సెప్టెంబర్ 20 : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి సహకార సంఘం గోదాం వద్ద శనివారం యూరియా కోసం ఎండలో బారులు తీరుతూ రైతులు ఇబ్బందిపడ్డారు. 225 బస్తాలు పంపిణీ చేశారు. ఇంకా 300 మంది రైతులకు అందకపోవడంతో అధికారులను నిలదీశారు. భీమారం మండల కేంద్రానికి 2394 బస్తాల వివిధ సెంటర్లు, ఫర్టిలైజర్ షాపులకు సరఫరా చేశారు.
పోలీస్ పహారా మధ్య గ్రోమర్ సెంటర్, రైతు వేదిక వద్ద రైతులకు ఏవో అత్తే సూధాకర్ ఆధ్వర్యంలో టోకెన్లు అందించారు. పాత తహసీల్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరి యూరియా బస్తాలను తీసుకెళ్లారు. ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బందిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద సుమారు 1300 బస్తాలను పోలీసుల పహారాలో పంపిణీ చేశారు. రైతులు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. ఎండకు తాళలేక సమీపంలో షాపుల వద్ద నీడలో నిల్చున్నారు.