దండేపల్లి : మంచిర్యాల జిల్లాలోని ఉప సర్పంచుల( Upa Sarpanches ) సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు పుట్టపాక తిరుపతి ( Tirupati ) అన్నారు. మంచిర్యాల జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడుగా దండేపల్లి మండలం తాల్లపేట ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతిని నియమిస్తూ రాష్ట్ర ఉపసర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల మహేష్ నియామక ఉత్తర్వులు సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉప సర్పంచుల సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు జితేందర్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు బోయిని తిరుపతి, ఉపసర్పంచ్ లు మాలవత్ రాజు, కాండ్రపు శ్రీలతలక్ష్మణ్, మర్సుకోల్ల ప్రభాకర్, పూదరి రమణయ్య, ఒడ్డేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.