రెబ్బెన : రెబ్బెన మండల మున్నూరు కాపు సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మున్నూరు కాపు మండల సంఘాన్ని ( Munnuru Kapu ) , మండల యూత్ కమిటీ ( Youth Committe ) ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జగడం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మాదాసు రవీందర్, ఉపాధ్యక్షులుగా దేవర నేని రవీందర్, జంబుల సాయి కృష్ణ, ప్రచార కార్యదర్శిగా మిట్ట దేవేందర్, కార్యదర్శిగా కర్నాథం వెంకటేశం, ఇంగు మల్లేష్ , కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఇంగు సాయి, ప్రధాన కార్యదర్శిగా ఎరువోతుల నాగేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జగడం సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో మున్నూరు కాపు సంఘం బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు.
అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు ఎన్నుకుంటామని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకైన అధ్యక్షులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు కర్నాధం సంజీవ్ కుమార్ ,చెన్న సోమశేఖర్, గజ్జెల సత్యనారాయణ, కొవ్వూరు శ్రీనివాస్, గోలెం తిరుపతి, మానేం కార్తీక్, హనుముల రాజేష్, ఒరగంటి మల్లేష్, పుదరి హరీష్ , కుందారపు బాలకృష్ణ, ఇందూరి తిరుపతి, మిట్ట వెంకటేష్, పుదరి బీంరావు, పిరిసింగుల సుబ్బారావు, ఏలుగల సాయి, పిరిసింగుల రాజన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.