కడెం, జూలై 11: ఎగువ ప్రాంతాల నుంచి కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో శుక్రవారం ప్రాజెక్టు గేటు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీల) కాగా, ప్రస్తుతం 693.500 అడుగులు (4.699టీఎంసీల) వద్ద ఉంది. గురువారం రాత్రి భారీగా వరద వచ్చి చేరడంతో అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
దీంతో ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకు 9వ గేటు ఎత్తి 4346 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవా రం ఉదయం వరకు ఇన్ఫ్లో 1581 తగ్గడంతో వ రదగేటును మూసినట్లు ఈఈ విఠల్ తెలిపారు. ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున గేట్లను ఎత్తే అవకాశం ఉందని, సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాంసి, జూలై 11 : మండలంలోని వడ్డాడి మత్తడి వాగు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు గాను ప్రస్తుతం 276.20 మీటర్లు ఉన్నదని ప్రాజెక్ట్ అధికారి హరీశ్ కుమార్ తెలిపారు. సామర్థ్యం 0.571 టీఎంసీలకు ప్రస్తు తం 0.320 టీఎంసీ ఉందన్నారు. 80 క్యూసెకుల ఇన్ ఫ్లో కొనసాగుతుందని తెలిపారు.