నెన్నెల : మంచిర్యాల జిల్లా నెన్నెల ( Nennela ) మండలంలోని పలు గ్రామాలలో గురువారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు, వడగండ్ల వర్షానికి ( Hailstorm) గ్రామాలు అతలం కుతలమయ్యాయి. నెన్నెల, ఘనపూర్, గొల్లపల్లి, చిత్తపూర్, అవుడం, గంగారాం, కొత్తూరు, వెంకటాపూర్ గ్రామాలలో దాదాపు రెండు వందల రేకులు ఇండ్లు, గుడిసెలు, పై కప్పులు లేచి పోయాయి. పలు చెట్లు విరిగి ఇండ్లపై పడ్డాయి. పదిమంది వరకు గాయాలపాలయ్యారు. పలు పశువులకు, చెట్లపై ఉన్న పక్షులకు గాయాలయ్యాయి.
కోతకు వచ్చిన వరి పొలాలు నేల రాలిపోయాయి. చెట్లు ఎక్కడికక్కడ విరిగి రోడ్లపై పడడంతో రోడ్ల వెంట నాటిన చెట్లు గాలికి విరిగి పోయాయి. దీతో రాత్రి వేల రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ మహేందర్, ఎంపీడీవో దేవేందర్, ఏవోలు నష్ట పోయిన పంటలను, దెబ్బ తిన్న ఇండ్లను పరిశీలించారు.