మిగిలింది నాలుగు రోజులే..
2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 బల్దియాలు ఉండగా, సుమారు రూ.60 కోట్లు పన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది.
- బల్దియాల్లో ముమ్మరంగా పన్నుల వసూళ్లు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు
- 91 శాతం సేకరణతో అగ్రభాగంలో లక్షెట్టిపేట
- వెనుకబడిన ఖానాపూర్, భైంసా, బెల్లంపల్లి
- సకాలంలో కట్టి సహకరించాలని అధికారుల విజ్ఞప్తి
2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 బల్దియాలు ఉండగా, సుమారు రూ.60 కోట్లు పన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటివరకు సుమారు రూ.34.50 కోట్ల మేర వసూలైంది. కాగా, 91 శాతంతో లక్షెట్టిపేట మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలవగా.. భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి వసూళ్లలో వెనుకబడి ఉంది. కాగా, పన్నులు కట్టి ప్రజలు సహకరించాలని వార్డుల్లో అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది.
– నమస్తే తెలంగాణ బృందం
నమస్తే తెలంగాణ బృందం : 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. మున్సిపాలిటీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వంద శాతం టార్గెట్‌ను చేరుకోవడానికి అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి పట్టణాల్లోని వార్డుల్లో పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్.. నిర్మల్ జిల్లాలో భైంసా. నిర్మల్, ఖానాపూర్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్.. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, నస్పూర్ బల్దియాలు ఉన్నాయి. కాగా, పన్నుల వసూళ్లలో ఉమ్మడి జిల్లాలో లక్షెట్టిపేట 91 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో ఉంది. ఖానాపూర్, భైంసా, బెల్లంపల్లి మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయి.
వసూళ్లపై ప్రత్యేక దృష్టి..
అభివృద్ధి పనులతోపాటు పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు యంత్రాంగానికి సహకరించాలి. పన్నులు కట్టి, మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటునందించాలి.
-చిక్యాల రత్నాకర్‌రావు, మున్సిపల్ కమిషనర్, ఖానాపూర్.
లక్ష్యం సాధించే దిశగా..
ఆస్తి పన్ను వసూలు వందశాతం సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందించాం. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేస్తాం. ప్రజలు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
-వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ , భైంసా

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

