భైంసా, జూలై, 29 : వరదలతో నష్టపోయిన రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి పేర్కొన్నారు. ఆటోనగర్‌కు చెందిన పలువురు అధికారులను నిలదీస్తుండగా.. శనివారం అటువైపు వెళ్తున్న వేణుగోపాలాచారి అక్కడికి వెళ్లారు. ఆటోనగర్ కాలనీ వాసులను సముదాయించారు. వర్షాలకు నష్టపోయిన బాధితులు ఆందోళన చెందవద్దని, ఇలాంటి పరిస్థితులు మున్ముందు రాకుండా ప్రభుత్వంతో మాట్లాడుతానని పేర్కొన్నారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి నష్టపోయిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. బ్రిడ్జి పెద్దగా నిర్మించేలా అధికారులకు నివేదికలు పంపిస్తానన్నారు. ఈయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాంవ్లీ రమేశ్, పండిత్ రావు, సోలంకి భీంరావు, కొట్టె హన్మండ్లు, దేవేందర్, ధర్మాగౌడ్, నరేందర్, ఎంఐఎం నాయకులు ఫయాజుల్లాఖాన్ తదితరులున్నారు.
సిరాల ప్రాజెక్టు సందర్శన
భైంసాటౌన్, జూలై 29 : తెగిపోయిన సిరాల ప్రాజెక్టును టీఎస్ ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి సందర్శించారు. వరద వివరాలను అధికారులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యాన్నిచ్చారు. ఆయన వెంట సోలంకి భీంరావు తదితరులున్నారు.
రైతులను ఆదుకుంటాం..
కుంటాల, జూలై, 29 : రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఎస్ ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. మండలంలోని పాత వెంకూర్ గ్రామాన్ని, భారీ వర్షానికి నష్టపోయిన పంట చేనులను పరిశీలించారు. ప్రభుత్వం తరపున తమకు పరిహారం అందించేలా కృషి చేయాలని సర్పంచ్ మగ్గిడి శ్రుతి-దిగంబర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కోరారు. కల్లూర్ సమీపంలో కోతకు గురైన చెక్‌డ్యాంను సైతం పరిశీలించారు. అందకూర్ బీఆర్ఎస్ నాయకుడు సాగర్ రావు పెద్దమ్మ అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులు జీవీ రమణారావు, భీంరావు, సావలి రమేశ్, ఎంపీటీసీ హన్మండ్లు, జాగృతి ముథోల్ నియోజకవర్గ అధ్యక్షుడు పండిత్ రావు, ఎంపీటీసీ మధు, శివాజీ పటేల్, దేవేందర్, ధర్మాగౌడ్, లింగారావు, రాములు, సర్పంచ్ బద్రి, సాయినాథ్, డీ యోగేశ్, పండరి, రాజ్ కుమార్, మనోహర్, రమేశ్, జలన్న, మారుతి, దినేశ్, బాధిత రైతులు పాల్గొన్నారు.