నేరడిగొండ, జనవరి 11 : ఒడ్డెర కుల ఆరాధ్యదైవం ఒడ్డె ఓబన్న జయంతిని నేరడిగొండలో ఒడ్డె రాజుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఒడ్డెరాజుల మండలాధ్యక్షుడు బొంతశాల శ్రీను మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో ఒడ్డె ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడని గుర్తు చే శారు. ఆయన బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన మహావీరుడని కొనియాడారు. ఒక సంచార జాతిలో పుట్టిన ఒడ్డె ఓబన్న సేవలు మరువలేనివన్నారు. అనంతరం నేరడిగొండలోని మండల కార్యాలయం వద్ద, బస్టాప్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఓబన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శివరాత్రి శేఖర్, కార్యదర్శి నాంపల్లి బోధాస్, కోశాధికారి నాగన్న, సభ్యు లు సీతారాం, నర్సయ్య, గోవింద్, నర్సింహులు, చిన్న నర్సింహులు, లింగయ్య, శం కర్, శివరాత్రి నర్సింహులు పాల్గొన్నారు.
తలమడుగు మండలం సుంకిడిలో..
తలమడుగు, జనవరి 11 : స్వాతంత్య్ర స మరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని మండలంలోని సుంకిడి గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా నాయకులు రాజమల్లు, సర్పంచ్ మహేందర్ యాదవ్, ఎంపీటీసీ గెల్లా గౌరమ్మ, గ్రామస్తులు ఆశన్న యాదవ్, వెంకట్ యాదవ్, మగ్గిడి ప్రకాశ్, వడ్డెర సంఘం నాయకులు భీమయ్య, నర్సింగ్ పాల్గొన్నారు.
ఓబన్న సేవలు మరువలేనివి
ఉట్నూర్, జనవరి 11 : ఒడ్డె ఓబన్న సేవలు మరువలేనివని వైస్ ఎంపీపీ బాలాజీ అన్నా రు. మండల కేంద్రంలోని శాంతినగర్లో ఒడ్డె ఓబన్న జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకుడు తన్నీరు సతీశ్, కులస్తులు తన్నీరు నాగరాజు, కుల స భ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.