మంచిర్యాలటౌన్, మే 26 : నల్లకోటమ్మ, లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు చైర్మన్, 13వ వార్డు కౌన్సిలర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో హమాలీవాడలోని శ్రీభక్తాంజనేయ, సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం (108 సార్లు) వేడుక వైభవంగా కొనసాగింది.
ఆలయ అర్చకులు సంగర్స్ సంతోష్ శర్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ నల్ల శంకర్, సభ్యులు విజయ్, తోట మహేశ్, తదితరులు పాల్గొన్నారు.