ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 24 : తమకు కూలీ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులు శనివారం సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ గోదాం ఎదుట కొనసాగుతున్న సమ్మెను వారు విరమించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్రోజ్, సాంబన్న, జహీర్, సురేశ్, పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, డిసెంబర్ 24 : తమ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంపై శనివారం పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్న హమాలీలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ జీవో జారీ చేయడంపై మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్, కార్యవర్గ సభ్యులు దాస్, షేక్షాకీర్, ప్రేమ్, హమాలీ యూనియన్ నాయకులు షేక్ అహ్మద్, ఆశన్న, ప్రసాద్, మహేశ్, రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 24 : తమకు కూలీ రేట్లు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై మండల కేంద్రంలో హమాలీలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బాధలను అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ డిమాండ్లను ఒప్పుకొని జీవో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఆత్రం నాగోరావ్, రమేశ్, అలీ, మహేశ్, ఖదీర్, శ్రీధర్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.