జైనూర్ : కుమ్రం భీం ఆసీఫాబాద్ జిల్లా జై నూరు మండలం దుబ్బగూడ గ్రామం హైమాస్ లైట్ల (High-mast Lights ) తో వెలిగిపోనుంది. ఇందుకు గాను శుక్రవారం సర్పంచ్ మాడవి కౌసల్యబాయి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంజూరు చేసిన నిధులతో హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియజ్ లాల, గ్రామ పటేల్ పెందోర్ దేవురావు, ఉపసర్పంచ్ అనుసూయ బాయి, రాము, పూస్నాక జంగుబాయి, వార్డు సభ్యులు పుస్నాక బుజంగ్రావు, పెందోర్ రాము, పెందోర్ జ్యోతిరాం, తదితరులు పాల్గొన్నారు.