తాండూర్ : మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా (ఏఈవో)లుగా సేవలందించిన శంకర్, ధనలక్ష్మి బదిలీ( Transfers ) అయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రైతు వేదికలో మండలంలోని సర్పంచులు, రైతులు, వివిధ పార్టీల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం వారిని సన్మానించారు. నూతనంగా ఏఈవోలుగా బాధ్యత లు స్వీకరించిన రాకేష్, మౌనికను సన్మానించి మెమెంటో అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న ఏఈవోలు ఇద్దరూ ఒకే జట్టుగా పనిచేస్తూ, మండలంలో వ్యవసాయాన్ని ముందడుగు వేయించారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను రైతులకు చేర్చడంలో , తెగుళ్ల నివారణలో రైతులకు సలహాలు ఇవ్వడంలో వీరి పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సుష్మ, ఏఈవో వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.