Dupleep Trophy : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను వరసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రజత్ పాటిదార్ (Rajat Patidar) దేశవాళీ క్రికెట్లో బిజీ కానున్నాడు. త్వరలో మొదలయ్యే దులీప్ ట్రోఫీ (Dupleep Trophy)లో పాటిదార్ సెంట్రల్ జోన్‌ను నడిపించాడు. ఈ ఐపీఎల్ విజేతను కెప్టెన్‌గా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. టీ20 చిచ్చరపిడుగు రింకూ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
దేశవాళీ సీజన్ 2026-27లో మొదటిదైన దులీప్ ట్రోఫీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ తమస్వ్వాడ్ను ప్రకటించాయి. శనివారం సెంట్రల్ జోన్ సెలెక్టర్లు ఐపీఎల్ విన్నర్ రజత్ పాటిదార్ కెప్టెన్‌గా పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. రింకూ సింగ్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించిన సెలెక్టర్లు.. ఇటీవలే టీ20ల్లో అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్‌ను పేస్ దళంలోకి తీసుకున్నారు.
Rajat Patidar visited Shri Mahakaleshwar Temple on the occasion of Sawan.pic.twitter.com/u13cDOrX8w
— Cricketopia (@CricketopiaCom) July 31, 2026
శ్రీలంక పర్యటనకు ఎంపికైన సరాన్ష్ జైన్ ఆల్‌రౌండర్ కోటాలో చోటు దక్కించుకోగా.. వికెట్ కీపర్లుగా ఆర్యన్ జుయల్, కునాల్ సింగ్ రాథోడ్ స్క్వాడ్‌లోకి వచ్చారు. స్పిన్నర్ హర్ష్ దూబే కూడా 15మందిలో స్థానం సంపాదించాడు. జూలై 31న ఉజ్జయిని దేవాలయంలో మహాకాళేశ్వరుడిని కుటుంబం సమేతంగా దర్శించకున్నాడు పాటిదార్.
Central Zone squad for Duleep Trophy 2026-27
Rajat Patidar (C), Rinku Singh (VC), Aryan Juyal (wicketkeeper), Saransh Jain, Aman Mokhade, Kunal Chandela, Zeeshan Ansari, Aryan Pandey, Arshad Khan, Ayush Pandey, Yash Rathod, Harsh Dubey, Kunal Singh Rathod (wk), Yash Thakur and… pic.twitter.com/09AAfj3WCa
— CREX (@Crex_live) August 1, 2026
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆగస్టు 23న దులీప్ ట్రోఫీ మొదలవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియనైన సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది. ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మ్యాచ్ విజేతను ఆగస్టు 30న పాటిదార్ సేన ఢీకొట్టనుంది. సెప్టెంబర్ 6వ తేదీన పైనల్ జరుగనుంది.
సెంట్రల్ జోన్ స్క్వాడ్: రజత్ పాటిదార్(కెప్టెన్), ఆర్యన్ జుయల్(వికెట్ కీపర్), సరాన్ష్ జైన్, అమన్ మొఖడె, కునాల్ ఛండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, రింకూ సింగ్(వైస్ కెప్టె్న్), ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్(వికెట్ కీపర్), యశ్ ఠాకూర్, నచికెట్ భుటే.