ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 10 : గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిషరించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలె క్టర్ దీపక్ తివారీకి కార్మిక నాయకులతో కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గం వెంకటేశ్, ధర్మయ్య, మల్లయ్య, లక్ష్మణ్, వెంకటేశ్, సంతోష్, శంకర్, గోపాల్, అంజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్మకురి చిరంజీవి తదితరులు ఉన్నారు.