తాంసి, ఏప్రిల్ 29 : ఈదుల్లా సవర్గాం గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఐరన్ లాడర్ పడి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రభాకర్(45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 17న గ్రామంలో ప్రభాకర్ విద్యుత్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఐరన్ లాడర్ పడి గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.
ఆందోళన చేసిన నాయకుల అరెస్టు
ఈదుల్లా సవర్గాంకు చెందిన మల్టీపర్పస్ వ రర్ ప్రభాకర్ విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డీపీవో కార్యాల యం ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టా రు. ప్రభాకర్ కుటుంబానికి రూ.50 లక్షల ఎ క్స్గ్రేషియాతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇ వ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆం దోళన విరమించాలని పోలీసులు చెప్పినా వి నకపోవడంతో వారిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.