బెల్లంపల్లి, అక్టోబర్ 18 : వడ్ల కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చాకెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. మండల ప్రజాప్రతినిధు లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో రూ.3 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గడ్డం అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, నాయకులు మునిమంద రమేశ్, కంకటి శ్రీనివాస్, చిట్యాల మధు, పీక లక్ష్మణ్, పెద్దపల్లి రామస్వామి, బస్తీవాసులు పాల్గొన్నారు.