మంచిర్యాల, జనవరి 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ స్థానంతోపాటు మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థా నానికి, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల సంఘం ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
ఏక కాలంలో ఒకే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యా య ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టి.జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఇరువురి పదవీకాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రో జు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది.
నామినేషన్లకు ఎనిమిది రోజుల సమయం ఇచ్చారు. ఫిబ్రవరి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉండనుంది. నామినేషన్ల గడువు ముగిశాక 12 రోజులపాటు ప్రచారం నిర్వహించుకోడానికి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. అనంతరం ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 8 నాటికి ఎన్నికల కోడ్ ముగియడంతోపాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తికానున్నది. కాగా.. గతంతో పోలిస్తే పట్టభద్రుల ఓటర్ల సంఖ్య పెరిగింది.
మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో 2.50 లక్షల మంది వరకు పట్టభద్రుల ఓటర్లు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కోసం పలు సంఘాల నాయకులు ప్రయత్నిస్తున్నారు. వివిధ విద్యా సంస్థల యజమానులు, వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందించిన వారంతా పోటీలో నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో స్పీడ్ పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలవ్యాప్తంగా ఎన్నికల కో డ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతోపాటుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడానికి అవకాశం లేదు. దీంతో ఈనెల 26వ తేదీన ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఆత్మీయ భరో సా, రైతు భరోసా పథకాల అమలుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. మార్చి 31వ తేదీ నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. కానీ.. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఈ జిల్లాలో ఆ సమయానికి పథకం అ మలును పూర్తి చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
ఎన్నికల కోడ్ దృష్ట్యా మిగిలిన పథకాల అమలుకు ఎన్నికల సంఘం ఆమోదించే అవకాశాలు తక్కువే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు పథకాన్ని అమ లు చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో ఇటీవల ప్రకటించిన పథకాల అమలు సాధ్యం అయ్యేలా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాక స్థానిక సంస్థల ఎన్నిక లు రావచ్చు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు ఇప్పట్లో ఉండదనే ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసే ప్రభుత్వం పథకాలను మొదలు పెట్టింద ని, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఇవ్వలేకపోయామని సాకులు చెప్పి, ఆ తర్వాత చేతులు ఎత్తేసే అవకాశమే ఎక్కు వ ఉందని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.