HomeAdilabadGovt Failed To Arrange Infrastructure In Adilabad Government School
Government School | మీద మెరుగు.. లోపల పురుగు.. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఇదీ!
Adilabad Govt School
2/7
Government School | తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
3/7
అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కానీ మీద మెరుగు.. లోపల పురుగు అన్న చందంగా బయట నుంచి అయితే అందంగా కనిపిస్తున్నాయి.
4/7
పాఠశాల గోడలకు రంగులు వేశారు కానీ లోపల మాత్రం కనీస మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి దయానీయంగా ఉంది.
5/7
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హిందీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుందరంగా కనిపించాలని రంగులు అయితే వేశారు కానీ మౌలిక వసతుల కల్పనను మరిచారు.
6/7
పాఠశాల ఆవరణలో మొత్తం గడ్డి, పిచ్చి మొక్కలు మొలిచి అపరిశుభ్రంగా ఉంది. అలాగే బయట ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షానికే మురుగునీరు నిలిచిపోతున్నది.
7/7
పాఠశాలకు కనీసం ప్రహారీ గోడను కూడా నిర్మించలేదు. ఇక పాఠశాల లోపల విద్యార్థులు కూర్చునే బెంచీలు కూడా పాడైపోయాయి. విరిగిపోయిన, శిథిలావస్థకు చేరుకున్న పాత బెంచీలను అలాగే ఉంచేశారు.