మంచిర్యాలటౌన్, జూన్ 6: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కలిసి ర్యాలీలు తీసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు, మెప్మా టీఎంసీ చంద్రయ్య, సీవో సుజాత, అరుణ, సరోజ, ఆర్పీలు, పాల్గొన్నారు.
కోటపల్లి, జూన్ 6 : కోటపల్లి మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. పాఠశాలలో గ్రామ సమాఖ్య సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, సమావేశమై పాఠశాలలోని సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయులు సూచించారు. అనంతరం గ్రామాల్లో అవగాహన ర్యాలీలను తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎంలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చెన్నూర్, జూన్ 6: చెన్నూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని గురువారం అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ర్యాలీ తీశారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గంగాధర్, ఎంఈవో రాధాకృష్ణమూర్తి, పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
మందమర్రి, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించి అవగాహన కల్పించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మెప్మా ఆర్పీలకు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్పీలతో సమావేశం నిర్వహించి బడిబాటపై పలు సూచనలు చేశారు. అనంతరం విద్యానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలోఫర్‌కు ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ రఘురాం, ఎమ్మార్పీ సదయ్య, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని నార్లాపూర్ ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ తీశారు. అనంతరం పాఠశాలలో ప్రతిజ్ఞ చేశారు.
వేమనపల్లి, జూన్ 6 : వేమనపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. బడీడు, బడి మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అనంతరం బడిబాట ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీపతి బాపురావు, ఎంఎన్‌వో శ్రీధర్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, హెడ్ మాస్టర్ సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, వీవో లక్ష్మీ, అంగన్వాడీ టీచర్లు రాణి, మధునక్క తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, జూన్ 6 : కన్నెపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బడిబాట ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కజ్జం రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాండూర్, జూన్ 6 : తంగళ్లపల్లి హైస్కూల్, ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంపై సమావేశంలో మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ 19వ తేదీ వరకు బడీడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి పాఠశాల హెచ్ఎం, మండల నోడల్ అధికారి ఎస్ మల్లేశం, మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాలల చైర్మన్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కిష్టంపేట గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాసాడి శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే పిల్లలకు నోట్ బుక్స్, బ్యాగ్ ఫ్రీ గా తమ సొంత ఖర్చులతో ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మధునమ్మ, ఉపాధ్యాయులు శ్రీను, మల్లీశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దండేపల్లి, జూన్ 6 : మండలంలోని అన్ని పాఠశాలల్లో బడి బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ భవిత కేంద్రం వెంకటేశ్వర్రావు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్పీలు, పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, జీపీ కార్యదర్శులు ఉన్నారు.
కెరమెరి, జూన్ 6: మండలంలోని కేజీబీవీతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీలు తీశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ అధికారి మీనా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజలున్నారు.
కౌటాల, జూన్ 6 : మండలంలోని ముత్తంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని జడ్పీఎస్ఎస్ హెచ్ఎం గావుడే హన్మంతు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు విఓ మౌనిక, సీసీ విలాస్, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దహెగాం, జూన్ 6: మండలంలోని ఇట్యాలలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు సెక్టోరల్ అధికారి కటుకం మధుకర్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. బడీడు, బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాధానోపాధ్యాయులు రవిశంకర్, సుధాకర్, ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులున్నారు.
చింతలమానేపల్లి, జూన్ 6 : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయుడు జయరాజ్, కార్యదర్శులు ఆసిఫ్ అలీ, విజయ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, జూన్ 6 : మండలంలోని ముల్కల్ల గ్రామంలో బడి బాట ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొమ్మ గణపతిరెడ్డి, ఉపాధ్యాయులు గ్రామ కమిటీ సభ్యు లు, సెల్ఫ్ హెల్ప్ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని విద్యార్థుల తల్లిదండ్రులను మండల విద్యాధికారి జాడి పోచయ్య, మున్సిపల్ కమిషనర్ ఎన్. మురళీకృష్ణ కోరారు. బడిబాట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఏ. శ్రీధర్, టీఎంసీ(మెప్మా) పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ సరిత, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.