ఖానాపూర్, అక్టోబర్ 28: ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ అధ్వర్యంలో మక్క కొనుగోళ్లు మూడు రోజులగా నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జూ పటేల్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు తూకం వేయకపోవడం రైతులను నిరాశకు గురి చేసింది. మంగళవారం కడెం మండలంలోని అల్లంపె ల్లి, బావ్యనాయక్తండా గ్రామాలకు చెందిన 20 మంది రైతులు 15 ట్రాక్టర్లలో 600 క్విం టాళ్లకు పైగా మక్కను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే కేంద్రం నిర్వాహకు లు గన్ని సంచులు, హమాలీల కొరత పేరుతో తూకం వేయకుండా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘80 కిలో మీటర్ల దూ రం నుంచి ట్రాక్టర్‌కు రూ. 6 నుంచి 8 వేల వరకు వ్యయం చేసి ఒక్కొ రైతు 80 క్వింటాళ్ల మక్కలను తీసుకొని వచ్చాం. ఇప్పుడు తిరిగి తీసుకెళ్లాల్సి వస్తోంది’ అని రైతులు వాపోయారు. తేమ శాతం పేరిట కొర్రిలు పెట్టడం అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యూరియా అందుబాటులో లేక పంటసాగు దెబ్బతింటే, కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంపై రైతులు మండిపడ్డారు.
దళారులను మాత్రం క్వింటాల్‌కు రూ. 1800 మాత్రమే ఇస్తున్నారని, సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. చివరికి కేంద్రం నిర్వాహకులు ప్రస్తుతం మక్క కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించడంతో మక్కలను తిరిగి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి మక్క కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ రైతులు మీసాల పెరమన్న, పరశురాం, సజన్‌లాల్, రిజేశ్, పోశన్న, మల్లేశ్, బక్కన్న, రాజరాం ఉన్నారు.