సారంగాపూర్, సెప్టెంబర్ 1 : ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకరోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ప్రతిపక్షాలు విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిర్మల్ పట్టణా నికి ఐఎఫ్‌డీఎస్ ద్వారా రూ. 25కోట్లు మంజూ రైనట్లు తెలిపారు. అడెల్లి దేవస్థాన అభివృద్ధికి రూ. 12కోట్లు మంజూరయ్యారని త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. మంత్రి గత ఆరు సంవత్సరాల క్రితం నాటిన రావిచెట్టును పరిశీలించారు.
అట్టహాసంగా ప్రమాణస్వీకారం..
మార్కెట్‌యార్డులో గురువారం నిర్వహించిన మార్కెట్ నూతన పాలకవర్గ స్వీకరోత్సవం అట్ట హాసంగా జరిగింది. చైర్‌పర్సన్‌గా చించోలి అశ్రిత రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా రాథోడ్ దత్తురాం, డైరెక్టర్లుగా జెల్ల అనిల్, గుమ్ముల మల్లేశ్, సింగం లక్ష్మీనా రాయణ గౌడ్, పాల పెద్ద వీరన్న, ఎస్కే రైస్ అహ్మద్, మీర్దా సాయన్న, వడ్డెపల్లి రమేశ్, వెంక ట్, బొంతల పోశెట్టి, జీ సాయినాథ్, ముత్యంరెడ్డి, వంగ రాంరెడ్డి, కౌట్ల (బీ) సొసైటీ చైర్మన్ అయిరా నారాయణరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఆశ్వక్ అహ్మద్, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్ బాబు, సారంగాపూర్ సర్పంచ్ సుజాత ప్రమాణ స్వీకారం చేశారు.
వీరితో జిల్లా మార్కె టింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినే టర్ నల్ల వెంకట్రామ్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరా వు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.