మూడ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నార్నూర్ మండలంలోని దన్నుగూడ చెక్‌డ్యాం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ గ్రామానికి రవాణా వ్యవస్థ స్తంభించింది.
బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. ఈ క్రమంలో మండాడి మారుతి, కోట్నాక్ మానిక్‌రావుకు చెందిన ఎడ్లు మంగళవారం పాముకాటుకు గురయ్యాయి. దీంతో గోపాలమిత్ర సహాయకుడు ఉత్తమ్‌కు సమాచారం అందించారు. అయితే గ్రామస్తుల సాయంతో కష్టంమీద ఆయన వాగు దాటారు. సకాలంలో వైద్యం అందించి ఎడ్ల ప్రాణాలు కాపాడారు.