మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్, డిసెంబర్ 15; చుట్టూ కొండాకోనలు.. మధ్యలో పచ్చని పంటలు, పిచ్చుకల అరుపులు, జంతువుల సందడి, చూడచక్కని ప్రకృతి సొగసుతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు పల్లెలు మనసును ఇట్టే దోచేస్తాయి. జిల్లాలోని కెరమెరి మండలం అనార్పల్లి గ్రామంలో ఎరుపెక్కిన గోంగూర పంట అటుగా వెళ్లినవారి దృష్టిని ఆకర్షిస్తున్నది. గోంగూర ఆకును తుంచిన తర్వాత చెట్టును తొలగించకుండా, అలాగే ఉంచుతారు. దీంతో గ్రామంలోని ప్రతి పెరడు ఇలా ఎరుపెక్కి, చూపరులకు కనువిందు చేస్తున్నది.. ఈ చెట్లకు ఉన్న కాయలు పండిన తర్వాత, గింజలను సేకరించి నూనెను తయారు చేసి వంటలకు ఉపయోగిస్తామని గిరిజనులు చెబుతున్నారు.