కాసిపేట : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ ( BRS ) కాసిపేట మండల జడ్పీటీసీ అభ్యర్థిగా గొంది వెంకటరమణ ( Gondi Venkataramana) ఖరారయ్యారు. ఈ మేరకు అధిష్టానం ప్రకటించడంతో గ్రామాల్లో జోరుగా ప్రచారం ప్రారంభించారు. కాసిపేట మండలంతో పాటు అనేక ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గొంది రాయల్స్ సంస్థ స్థాపించి క్రీడాకారులకు సదుపాయాలు కల్పించడంతో ముందంజలో ఉన్నారు.
అందరికీ అందుబాటులో ఉంటూ బీఆర్ఎస్ నాయకుడిగా గొంది వెంకటరమణ అందిస్తున్న సేవలకు గాను ప్రజల మద్దతు ఉంటుందనే అభిప్రాయం మేరకు జడ్పీటీసీ టికెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గొంది వెంకటరమణ ప్రజలను కోరారు.