గణేశ్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపు కోవాలని ఆదిలాబాద్, నిర్మల్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదిలా బాలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరం లో ఎస్పీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ, ముస్లిం మత పెద్దతో కలిసి శాంతికమిటీ సమావే శం నిర్వహించారు. భైంసాలో గణేశ్ మండపాలను ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు.

ఎదులాపురం : హాజరైన హిందూ, ముస్లిం మతపెద్దలు
సంస్కృతీ సంప్రదాలయాలకుఆదిలాబాద్ నిలయం
ఎదులాపురం, సెప్టెంబర్ 3 : సంస్కృతీ సంప్ర దాయాలకు ఆదిలాబాద్ జిల్లా నిలయమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొ న్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ, ముస్లిం మత పెద్దతో కలిసి శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు హిందూ ఉత్సవ సమితి సభ్యులు తమ సమస్యలను తెలి పారు. అలాగే ముస్లిం మత పెద్దలు పండుగలను సామరస్యంగా నిర్వహించు కుందామని తెలిపా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మండ పాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో ఎక్కువ గా శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఎల్లవేళలా అందు బాటులో ఉంటారని, అత్యవసర సమయంలో డయల్ 100కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వీ ఉమేందర్, పట్టణ సీఐలు పీ సురేంద ర్, కే శ్రీధర్, ఆర్ఐలు డీ వెంకటి, ఎం. శ్రీపాల్, మున్సిపల్ ఈఈ తిరుపతి, టీపీవో అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

భైంసా :మండపాల రూట్లను పరిశీలిస్తున్న నిర్మల్ ఎస్పి ప్రవీణ్ కుమార్
భైంసాలో..
భైంసా, సెప్టెంబర్ 3 : భైంసాలో గణేశ్ మండ పాలను నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సభ్యులు గణేశ్ మండపాల వద్ద నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ లు చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు ఉత్త ర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని సూచించారు. భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, ఎస్బీ సీఐ రమేశ్, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు ఉన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 3 : వినాయక శోభా యాత్ర జరుగనున్న ప్రాంతాల్లో ఏర్పాట్లను నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి పరిశీలించారు. వేడుక లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు అంద రూ సహకరించాలని సూచించారు. పట్టణ సీఐ శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ మధుసూదన్, ఏడీ రవి, ఏఈ శ్రీనివాస్, పోచయ్య, స్థానిక కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ తదితరులున్నారు.