వివేక్ వెంకటస్వామి.. ఈ పేరు వింటేనే పొలిటికల్ టూరిస్టా, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, వ్యాపారాలు కాపాడుకోడానికి పూటకో పార్టీ మార్చే వ్యక్తిగా గుర్తుకొస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి వెళ్లడం, ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు చూసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ పదకొండేళ్లలో ఆరు సార్లు పార్టీలు మార్చిన అరుదైన ఘనత ఆయన సొంతం. వేల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకోవడానికి, దిగజారుడు రాజకీయాలు చేయడం ఆయన నైజం.
ఎంపీగా చేసినా పట్టుమని పది అభివృద్ధి పనులు కూడా చేయలేదంటే ఆయన రాజకీయాలను ఎంతలా వాడుకుంటారో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నించిన వ్యక్తి అదే పార్టీలో చేరడం నవ్వుల పాలు చేస్తోంది. హస్తం పార్టీని వివేక్ దూషించిన వీడియోలు, ఏ సంవత్సరంలో ఏ పార్టీ మారారనే క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరువు పోయిందంటూ ఆయన వర్గీయులు, సన్నిహితులు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
– మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలోనే నిలకడ లేని నాయకుడు ఎవరంటే తాను తప్ప మరొకరు కాదని గడ్డం వివేక్ మరోసారి నిరూపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రోజుకో పార్టీ మార్చడం, పూటకో మాట చెప్పడంలో ఆయనను మించినోళ్లు లేరని రుజువు చేశాడు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా ఆరుసార్లు పార్టీలు మార్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికి ఆయన ఎంతకైనా దిగజారుతాడు.
గోడ మీద పిల్లిలా ఉం డి ఏ పార్టీతో తనకు లాభం జరుగుతుందో, ఏ పా ర్టీలో ఉంటే రాజకీయ పబ్బం గడిస్తోందో ఆ పార్టీ సంకలో దూరడం ఆయన నైజం. వ్యాపారం చే యడంలో బాగా తెలిసిన ఆయన, రాజకీయాలను వ్యాపారం చేయడంలో దిట్టగా మారిపోయారని స్వయంగా ఆయన సన్నిహితులే చెప్తుంటారు. ఇ లాంటి పరిస్థితిలో బీజేపీకి రాజీనామా చేసి మరోసారి కాంగ్రెస్‌లో చేరి పరువు తీసేసుకున్నారు.
వివేక్ పార్టీలో చేరిన సందర్భంగా టీపీసీసీ అ ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దేశంతో గాంధీ కుటుంబం ఎంత కీలకమో.. తెలంగాణకు వెంకటస్వామి కుటుంబం అంతే కీలకమంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి గడ్డం వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి(కాక) ఎంతో ఆదర్శమైన రాజకీయాలు చేశారు. కాంగ్రెస్‌ను విడవకుండా దేశం గర్వించదగిన దళిత నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణానంతరం వచ్చిన గడ్డం వివేక్ గానీ, ఆయన సోదరు డు గడ్డం వినోద్ గానీ కాక మార్క్‌ను అందుకోలేకపోయారు. తండ్రిలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని లేకుండా అవసరం ఇచ్చినప్పుడల్లా, టికెట్ల కోసం పార్టీలు మారారు. 2012 వరకు కాంగ్రెస్‌లో ఉ న్న వివేక్, 2013లో బీఆర్ఎస్లో చేరారు.
ఏడా ది గడవక ముందే మరోసారి కాంగ్రెస్‌లోకి వెళ్లి, తరువాత మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లారు. కొన్ని రో జులకు బీజీపీలోకి వెళ్లి ఇప్పుడు మరోసారి కాం గ్రెస్ పార్టీలోకి మారారు. తమ్ముడి బాటలోనే అ న్న గడ్డం వినోద్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కక, బీఎస్పీలో చేరి బెల్లంపల్లిలో ఏనుగు గు ర్తుతో పోటీ చేశారు. అలాంటి చరిత్ర ఉన్న గడ్డం వినోద్, వివేక్‌లు ఇప్పుడు తిరిగి పార్టీలోకి వచ్చినంత మాత్రాన.. గడ్డం బ్రదర్స్‌ను రేవంత్‌రెడ్డి ఆ కాశానికి ఎత్తేశారు. కాంగ్రెస్ అంటేనే గాంధీ ఫ్యా మిలీ. అలాంటి ఫ్యామిలీని అవసరం కోసం పార్టీ లు మార్చే గడ్డం బ్రదర్స్ ఫ్యామిలీతో రేవంత్‌రెడ్డి ఎలా పోల్చారనేది చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి గడ్డం వివేక్ ఎంపీగా, గడ్డం వినోద్ రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పటికీ చెన్నూర్ నియోజకవర్గానికి చేసిందేమి లేదు. వారసత్వ రాజకీయ నాయకులుగా పట్టుమని పది అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అందుకే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారి తలరాతలు మారడం లేదు. అలాంటప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాను చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలను మరోసారి భ్రష్టు పట్టించేందుకు నిజమైన పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారనే చర్చ జిల్లాలో మారుమోగిపోతోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యమని మాట్లాడిన వివేక్ వీడియోలు, ఏ సంవత్సరంలో ఏ పార్టీ మారారు, ఆరు సార్లు పార్టీ మారారనే క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఉన్న పరవు కాస్తా పోయిందంటూ వివేక్ వర్గీయులు, ఆయన సన్నిహితులు వాపోయే పరిస్థితి వచ్చింది.
గడ్డం వెంకటస్వామి(కాక) కుమారుడు గడ్డం వివేక్ చేరికతో చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులు లేక, దరఖాస్తులకు ఆహ్వానించింది. దీంతో మాజీ మంత్రి బోడ జనార్దన్‌తోపాటు డాక్టర్ రాజా రమేశ్, గో మాస శ్రీనివాస్, నూకల రమేశ్, దుర్గం అశోక్, భాస్కర్, రామిండ్ల రాధిక ఇలా దాదాపు 14 మం ది దరఖాస్తు చేసుకున్నారు. చివరకు మాజీ ప్ర భుత్వ విప్ నల్లాల ఓదెలు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ కోసమే ప్రత్యేకంగా కాంగ్రెస్‌లో చేరారు.
కానీ.. ఇప్పుడు ఉన్న ఫలంగా వివేక్ పార్టీలోకి రా వడంతో వీరందరి ఆశలు గల్లంతయ్యాయి. మిగిలిన బీజేపీలో టికెట్ కోసం వీరిలో కొందరు పైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. నల్లాల ఓదెలుసహా మరోనేత బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. మ రో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ టికెట్ ఇవ్వని పక్షం లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిపింది. ఉన్న కొద్ది పాటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలిపోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.