కెరమెరి, డిసెంబర్ 23 : అడవులను సంరక్షిం చే బాధ్యత మనందరిపై ఉందని కెరమెరి ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ అన్నారు. సోమవారం ఝరి గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఆర్వో మాట్లాడు తూ ప్రకృతి పరిరక్షణ అడవులతోనే సాధ్యమ ని, వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పులి సంచరిస్తుందనే బెడదతో అడవుల్లో నిప్పు పెట్టి వన్యప్రాణులకు హాని కలిగించవద్దని తెలిపారు.
కొంత మంది పంటల రక్షణ పేరిట విద్యుత్ వైర్లు అమర్చడం, వన్యప్రాణులను వేటాడడం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల కాపారులు, చేలకు వెళ్లే రైతులు తీసుకోవాల్సిన జాగ్రతలపై పోస్టర్లు ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఎఫ్ఎస్ వో శ్రావంతి, ఎఫ్బీవోలు రామయ్య, నరసింహారెడ్డి, దేవిదాస్, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్రా వ్, సిబ్బంది షేక్గౌస్, కౌలాస్ పాల్గొన్నారు.