దండేపల్లి, ఆగస్టు 18 : మండలంలోని మేదరిపేటకు చెందిన ప్రముఖ వైద్యురాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్ మర్రి ప్రవీణారెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. 2000-05 లో తెలుగుదేశం పార్టీ తరఫున దండేపల్లి జడ్పీటీసీగా గెలుపొంది, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్‌గా పని చేశారు.
వైద్య రంగంలోనూ గుర్తింపుపొందిన ఆమె మేదరిపేటలో ప్రైవేటు నర్సింగ్ హోం నడుపుతూ దండేపల్లి, జన్నారం, కడెం, లక్షెట్టిపేట ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించారు. మేదరిపేటలోని జరిగిన అంతిమయాత్రలో మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ వాళులర్పించారు.