నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మహాగావ్ గ్రామంలో అనారోగ్యం చనిపోయిన కారోబార్ రాథోడ్ విష్ణు తల్లి పోరిబాయి ( Poribai ) ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన తెర్వీ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ( Rathod Janardhan ) , ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ పాల్గొని పోరిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆడే సురేష్, ఏఎంసీ డైరెక్టర్ కైలాస్, మాజీ సర్పంచులు బానోత్ గజానంద్ నాయక్, రాథోడ్ రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, బంజారా నాయకులు పాల్గొన్నారు.