బెజ్జూర్, డిసెంబర్ 27 : మండంలోని సలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొడ్ప విశ్వేశ్వర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని పరామర్శించారు.
విశ్వేశ్వర్ తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొండ్ర జగ్గాగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిడాం సకారాం, బీఆర్ఎస్ నాయకులు డోకె వెంకన్న, రేణుకుంట్ల పెంటయ్య, జావీద్ అలీఖాన్ తదితరులు ఉన్నారు.