రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 3: టీఆర్ఎస్వీ నా యకులు, క్యాతనపల్లి మున్సిపాలిటీ 4వ వార్డు సోషల్ మీడియా అధ్యక్షుడు పవన్ తం డ్రి సునాకర్ బాపు ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సు మన్ పరామర్శించారు. బాపు చిత్రపటానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
15వ వార్డు ఇన్చార్జి పాల్ రాజ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించా రు. 12వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రమ్య ప్రే మ్సాగర్ అత్తమ్మ రాధ అనారోగ్యంతో మృతి చెందారు. కౌన్సిలర్ రమ్య కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.