మంచిర్యాల, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో కాంగ్రెస్ గూండారాజ్ మొదలైంది. కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్పై నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన నేపథ్యం లో శుక్రవారం హైదరాబాద్‌లో నిరసనకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునివ్వగా, పోలీసులు గురువారం రా త్రి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందుస్తుగా అరెస్టులు చేశారు. ఇళ్లలోకి చొచ్చుకొచ్చి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మం త్రి జోగురామన్నను పోలీసులు హౌజ్ అరె స్టు చేశారు. శుక్రవారం ఉదయం రామన్న దగ్గరికి వెళ్లిన పోలీసులు ఇల్లు వదిలి బయటికి రావొద్దని సూచించా రు.
మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్ధమైన బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ను సైతం పోలీసులు నిర్బంధించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జడ్పీ మాజీ చైర్మన్ లో లం శ్యాంసుందర్, నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త రాంకిషన్రెడ్డిని అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలో నస్పూర్, బెల్లంపల్లి, కోటపల్లి, భీమారం మండల కేం ద్రాలతో పాటు నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, కడెం, పెంబి, కుంటాల మండలాలు సహా ఆదిలాబాద్ జిల్లా లో ఇంద్రవెల్లి, ఉట్నూర్, తాంసి, నార్నూర్, తలమడు గు, బేల, సిరికొండ, బోథ్ మండలాల్లో బీఆర్ఎస్ నా యకులు, కార్యకర్తలను ముందుస్తుగా అరెస్టు చేయగా, తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో ని యంతృత్వ పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణలో ప్రతిపక్షాలకు నిరసనలు తెలిపే స్వా తంత్య్రం లేకుండా పోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్‌కు భయమని, అందుకే మా పార్టీ కార్యకర్తలను హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకున్నదన్నా రు. పోలీసులను ప్రత్యేకంగా మోహరించి అరెస్టులు చే యాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి, మాజీ మంత్రుల అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడుల పాలన గా మారింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండిస్తున్నాం. మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం. హైదరాబాద్‌కు నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి అల్లర్లు సృష్టిస్తున్నారు.
– అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎ స్కు భయపడి మా శ్రేణుల ను అరెస్ట్‌లు చేయిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ రౌడీలతో దాడులు చేయిస్తున్నది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం శాంతియుతంగా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే శాంతిభద్రతలు అదుపుతప్పాయి. అత్యాచారా లు, హత్యలు జరుగుతున్నాయి. ఓటుకు నోటు కేసులు పట్ట పగలు దొరికిన దొంగ సీఎం రేవంత్ రెడ్డికి రౌడీయి జం అలవాటే. కౌశిక్‌రెడ్డి ఇంటిపై ముఖ్యమంత్రి కాంగ్రెస్ రౌడీలను పంపి దాడి చేయించారు. రాష్ట్రంలో శాంతిభద్ర తలు చక్కగా ఉంటే పెట్టుబడులు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నది.
– జోగు రామన్న, మాజీమంత్రి
ఖానాపూర్, సెప్టెంబర్ 13: ప్రజా పాలన ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నారు. దాడికి పాల్పడిన అరికపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులను అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదు. బీఆర్ఎస్ నేతలంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు వణుకు పడుతుంది.? దాడి చేసిన వారిని వీడిచి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటు. సీఎం ప్రోద్బలంతో జరుగుతున్న అక్రమ విధానాలను ప్రజలు గ్రహిస్తున్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదు.
-ఖానాపూర్ బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్