ప్రజలను మోసం చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
మూతబడిన సిమెంటు పరిశ్రమ, ఎయిర్ పోర్టు నిర్మాణం, ఇండస్ట్రీయల్ కారిడార్ విషయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రామన్న మాట్లాడారు.
- ఎయిర్‌పోర్టు, కారిడార్, సీసీఐలపై స్పష్టత కరువు
- అభివృద్ధి పేరిట పక్కదోవ పట్టిస్తున్నారు
- కమిషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణం
- మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : మూతబడిన సిమెంటు పరిశ్రమ, ఎయిర్ పోర్టు నిర్మాణం, ఇండస్ట్రీయల్ కారిడార్ విషయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రామన్న మాట్లాడారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండిస్ట్రీయల్ కారిడార్, సీసీఐ, విమానాశ్రయం నిర్మాణాలపై స్పష్టత లేదని, కేవలం కమిషన్ కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టుపై స్పష్టత ఇవ్వకున్నా ఎమ్మెల్యే డీపీఆర్ పూర్తయిందని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని, లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేస్తే సహించేది లేదన్నారు.
సీసీఐ ప్రైవేటీకరణ
కేంద్ర మంత్రులు మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తామని హామీలు ఇచ్చి పక్కన పెట్టారని, పరిశ్రమ తు క్కును వేలం వేసి ప్రైవేటీకరణ కోసం ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఆదిలాబాద్‌ను ఏరోస్పేస్ జోన్‌గా గుర్తిం చి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.8 కోట్లతో సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేలను ఇప్పుడున్న నాయకులు అడ్డుకున్నారు. ఎలాంటి ఎంవోయూలు, డీపీఆర్‌లు లేకపోయినా ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయిందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు పూ ర్తి వివరాలు వెల్లడించకపోతే ఎంపీ, ఎమ్మెల్యే ల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామన్నా రు. బీఆర్ఎస్ నాయకులు విజ్జగిరి నారాయ ణ, అజయ్, ప్రహ్లాద్, అశోక్ స్వామి, వసంత్, గణేశ్, పరమేశ్వర్, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

